Thursday, December 19, 2024

రాహుల్ లీడర్ కాదు.. రీడర్: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఎవరో రాసిఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివిన కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ లీడర్ కాదని అయన కేవలం రీడర్ మాత్రమే విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.రెండు సార్లూ ఏ ఐ సి సి అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టిన ఆయన నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే రాహుల్ గాంధీ ఊటంకించారని ఎద్దేవ చేశారు.బిజెపికి బిఆర్‌ఎస్ ఎన్నటికి రిశ్తేదార్ కాదన్న మంత్రి జగదీష్ రెడ్డి రాహులే మోడీకి గుత్తేదారన్నారు. రాహెల్ గాంధీ ఏ హోదాలో నాలుగు వేల పింఛన్ ప్రకటించారు? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఫించన్ ఎంత ? ఫించన్ ప్ల కార్డులు రాహులు తెలిసి పట్టుకున్నారా లేక తెలియక పట్టుకున్నారా? నాలుగు వేల ఫించన్ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

కాంగ్రెస్ పార్టీని కొన ఊపిరితో బతికిస్తున్న చత్తీస్ ఘడ్ లో వృద్దులకు రూ. 350,  వికలాంగులకు రూ. 500, వితంతువులకు ఇచ్చేది రూ. 350 మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో వృద్దులకు రూ. 750, వికలాంగులకు 750,వితంతువులకు రూ ,550 మాత్రమే అని తెలిపారు. సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కర్ణాటక లోనూ ఇచ్చేది అంతకంటే ఎక్కువేమీ లేదన్నారు.కర్ణాటకలో వృద్దులకు రూ.800, దివ్యాంగులకు రూ,800 వితంతువులకు 800 రూపాయలే అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన కర్ణాటకలో కొన ఊపిరితో ఉన్న చత్తీస్ ఘడ్, పార్టీని నిలబెట్టిన రాజస్థాన్‌ల లో రూ. 4 వేల ఫించన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇవ్వని ఫించన్లు తెలంగాణాలో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గుండాలన్నారు. రూ . 4 వేల పింఛన్ అనే ప్రకటనను ఇక్కడి ప్రజలు ఏ మాత్రం నమ్మడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దివ్వాంగులకు రూ. 4 వేలు, వితంతువులకు రూ. 2016 వృద్దులకు  రూ. 2,016 ఇస్తున్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతో అని కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసిందన్న మంత్రి కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మెడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News