Wednesday, January 22, 2025

కేదార్‌నాథ్ లో రాహుల్-వరుణ్ గాంధీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మంగళవారం కేదార్‌నాథ్ ఆలయ సందర్శనకు వెళ్లారు. అక్కడ ప్రార్థనలు నిర్వహించారు. ఇదే సమయంలో పూజాదికాల కోసం అక్కడికి రాహుల్‌కు వరుసకు సోదరుడు బిజెపి ఎంపి వరుణ్ గాంధీ కూడా వచ్చారు. ఆలయ ఆవరణలోనే ఇరువురు కొద్దిసేపు కలుసుకుని మాట్లాడుకున్నారు. ఇది కొంత రాజకీయ ఊహాగానాలకు దారితీసింది. చాలా కాలంగా వరుణ్ గాంధీ బిజెపి పట్ల అసంతృప్తితో ఉన్నారు. తమ్ముడు వరుణ్ వెంబడి ఆయన కూతురు కూడా వచ్చిందని తనకు సంతోషం వేసిందని రాహుల్ స్పందించారు.

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో రాహుల్ గాంధీ మూడురోజులుగా ఉన్నారు. వరుణ్ గాంధీ మంగళవారం ఇక్కడికి కుటుంబంతో పాటు వచ్చారు. వీరిద్దరు కలుసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సోదరులు ఎప్పుడూ కలుసుకోరని, అయితే వీరి మధ్య మంచి సహోదర బంధం ఉందని వీరి సంబంధితులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News