Saturday, March 22, 2025

తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ దూరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. వ్యక్తిగత కారణాలతో రాహుల్ ఈ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోతున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. రాహుల్ భార్యత అతియా శెట్టి మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో రాహుల్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. రాహుల్ అందుబాటులో లేక పోవడం ఢిల్లీకి పెద్ద లోటుగానే చెప్పాలి. ఇప్పటికే హ్యారి బ్రూక్ వంటి స్టార్ ఆటగాడు జట్టుకు దూరమయ్యాడు. రాహుల్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడడం లేదు. కాగా, ఢిల్లీ టీమ్‌కు అజింక్య రహానె సారథ్యం వహిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News