Wednesday, February 12, 2025

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా రెండోసారి రాహుల్ నార్వేకర్

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బిజెపి ఎంఎల్ఏ రాహుల్ నార్వేకర్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి  ఆ పదవికి నామినేషన్ వేయలేదు. దాంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీలో కూడా ఆయన రెండున్నర ఏళ్ల పాటు స్పీకర్ గా కొనసాగారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ శనివారం ఎంపికయ్యారు. వారిచేత పదవీ ప్రమాణాన్ని తాత్కాలిక స్పీకర్  కాళిదాస్ కొలంబ్కర్ ఉదయం 11 గంటలకు పదవీ ప్రమాణం  చేయించారు.  మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో మహాయుతి సంకీర్ణం 230 సీట్లు గెలుచుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News