Saturday, April 5, 2025

ఇడి డైరెక్టర్‌గా రాహుల్ నవీన్

- Advertisement -
- Advertisement -

ఫెడరల్ మనీ లాండరింగ్ నిరోధక సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తాత్కాలిక అధిపతి రాహుల్ నవీన్ సంస్థ పూర్తి కాలపు డైరెక్టర్‌గా బుధవారం నియుక్తుడయ్యారు. క్యాబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి) జారీ చేసిన ఒక ఉత్తర్వు ప్రకారం, 1993 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) ఆదాయపు పన్ను కేడర్ అధికారి నవీన్‌ను ‘పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండు సంవత్సరాల పాటు లేదా తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు, ఏది ముందైతే అప్పటి వరకు’ నియమించడమైంది. ఇడి డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శి (ఎఎస్) ర్యాంక్ పదవి.

నవీన్‌ను నిరుడు డిసెంబర్‌లో ఎఎస్‌గా ప్యానెల్‌లో చేర్చారు. 57 ఏళ్ల నవీన్ ప్రత్యేక డైరెక్టర్ (ఒఎస్‌డి)గా ఇడిలో 2019 నవంబర్‌లో చేరారు. సంజయ్ కుమార్ మిశ్రా నిరుడు సెప్టెంబర్ 15న పదవీ విరమణ చేసిన తరువాత నవీన్ ఇడి తాత్కాలిక డైరెక్టర్‌గా నియుక్తుడయ్యారు. మిశ్రాకు సన్నిహితునిగా పరిగణిస్తున్న నవీన్ ఇడి అధిపతిగా ఉన్నప్పుడే వేర్వేరు మనీ లాండరింగ్ కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వంటి ఉన్నత స్థాయి అరెస్టులు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News