Monday, December 23, 2024

ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

Rahul on PM Modi's fuel tax appeal to states

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పన్నులను తగ్గించనందుకు రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తప్పుబట్టారు. మొత్తం ఇంధన పన్నులలో 68% కేంద్రం తీసుకుంటుందన్నారు. అధిక ఇంధన ధరలైనా, బొగ్గు కొరత అయినా, ఆక్సిజన్ కొరత అయినా కేంద్రం రాష్ట్రాలను నిందిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రాలపై నెపం వేస్తూ ప్రధాని తన బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర-రాష్ట్ర సహకారం గురించి మాట్లాడుతూ… పిఎం మోడీ పెట్రోల్, డీజిల్ పన్ను ఉదాహరణను ఇచ్చారు. గత సంవత్సరం కేంద్రం పన్నును మాఫీ చేసిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ఇంధనంపై వాట్ ను తగ్గించాయని చెప్పారు. కానీ కొన్ని రాష్ట్రాలు చేయలేదు, ఇది వారి ప్రజలకు, పన్ను తగ్గించిన రాష్ట్రాలకు కూడా అన్యాయం. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్ పేర్లను ప్రస్తావిస్తూ, ఈ రాష్ట్రాలు ఇంధనంపై పన్ను తగ్గించలేదని, ఇంధన పన్ను తగ్గించిన కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని, తద్వారా తమ ఆదాయాన్ని త్యాగం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News