బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 47 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 284 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 139 బంతుల్లో 84 పరుగులు చేసి నాథన్ లయన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో వికెట్‌పై రాహుల్ జడేజా 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ రోహిత్ శర్మ పది పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(37), నితీష్ కుమార్ రెడ్డి(05) బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్నీస్ చెరో రెండు వికెట్లు తీయగా జోష్ హజిల్‌వుడ్, నాథన్ లయన్ చెరో ఒక వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా స్కోరు: 445
KL Rahul catch 🫣#INDvsAUS pic.twitter.com/p9ZOpiwyXV
— Ankit Tyagi (@ankityagi9) December 17, 2024