అమృత్‌సర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో కలసి గురువారం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. పంజాబ్ భవిష్యత్తును కాంక్షిస్తూ తాను, తన పార్టీ అభ్యర్థులు హర్మీందర్ సాహిబ్‌లో ప్రార్థనలు చేసినట్లు రాహుల్ ట్వీట్ చేశారు. స్వర్ణ దేవాలయంలో ప్రార్థనల అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులతో కలసి రాహుల్ గాంధీ అక్కడే భోజనం చేశారు. ఆయన వెంట పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని, పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు. అనంతరం&రాహుల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జనవరి 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత రాహుల్ రాష్ట్రాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 20న జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 109 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. మరో 8 స్థానాలకు పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించవలసి ఉంది.
కాంగ్రెస్ అభ్యర్థులతో కలసి స్వర్ణ దేవాలయంలో రాహుల్ ప్రార్థనలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -