Sunday, January 19, 2025

తెలంగాణలో రాహుల్ , ప్రియాంక 2 రోజుల ప్రచార యాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీలలో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో వివిధ చోట్ల బహిరంగ సభలలో ప్రసంగించడంతోపాటు రాహుల్ గాంధీ షాద్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి షాద్‌నగర్ చౌరస్తా వరకు పాదయాత్ర కూడా నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కొల్లాపూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారు. అంతేగాక తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రియాంక గాంధీ దేవరకద్రలో మహిళలతో ముఖాముఖీ మాట్లాడతారని వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 18న రాష్ట్రంలో బస్సు యాత్రలో రాహుల్, ప్రియాంక ఇద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం తెలంగాణలో జరిగిన బహిరంగ సభలలో ప్రసంగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News