Wednesday, January 22, 2025

Priyanka Gandhi: ఇక దేశమంతా రాహుల్ ప్రశ్నల ప్రతిధ్వని: ప్రియాంక

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ట్విటర్ వేదికగా శనివారం ప్రియాంక ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల గొంతుకను అణిచివేయడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలకు సంబంధించిన వీడియోను ఆమె పోస్టు చేస్తూ..ఈ ప్రశ్నలు వేసినందుకే రాహుల్ గాంధీపై దాడి చేశారని ఆమె రాసుకొచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తితే అదానీ నౌకరు ఆ గొంతును నొక్కివేయడానికి కుట్రపన్నారని ఆమె ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పక తప్పదని ఆమె స్పష్టం చేశారు.

శుక్రవారం కూడా ప్రియాంక మోడీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక ప్రధాని(రాజీవ్ గాంధీ) కుమారుడిని దేశద్రోహి అంటూ మోడీ అనుచరులు నిందించారని ఆమె పేర్కొన్నారు. గాంధీ కుటుంబాన్ని, కశ్మీరు పండిట్లు అందరినీ మోడీ పార్లమెంట్‌లో అవమానించారని ఆమె అన్నారు. అయినప్పటికీ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడలేదని, ఆయన పార్లమెంట్ సభ్యత్వం నుంచి అనర్హుడు కాలేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. దేశ పార్లమెంట్ కన్నా, ప్రజల కన్నా మీ స్నేహితుడు గౌతమ్ అదానీయే గొప్పవాడా అంటూ కూడా ఆమె మోడీని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News