Friday, November 15, 2024

అగ్నిపథ్ పథకం పై ప్రశ్నలు లేవనెత్తిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నాశిక్ లో అగ్నివీర్ లు ఇద్దరు శిక్షణ కాలంలో చనిపోయాక, ఒక సైనికుడి ప్రాణం కంటే మరో సైనికుడి ప్రాణం ఎందుకు ఎక్కువ విలువైనది అని ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ ను ప్రశ్నించారు.అగ్నివీర్ కుటుంబాలకు ఒకే పింఛను, ఒకే రకమైన ప్రయోజనాలు ఎందుకు అందవన్నారు. ఈ అన్యాయంపై తాను పోరాడతానన్నారు.

నాశిక్ లో శిక్షణ కాలంలో గోహిల్ విశ్వరాజ్ సింగ్, సైఫత్ షీత్ చనిపోయారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని కూడా రాహుల్ గాంధీ అన్నారు. అగ్నివీర్ పథకంపై ఈ ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. వారి కుటుంబాలకు పరిహారం సకాలంలో అందుతుందా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం ఈ విషయంలో విఫలం అయిందన్నారు. ఆయన ఈ విషయాలను ఎక్స్ వేదికగా హిందీలో పోస్ట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News