Monday, December 23, 2024

మయాంక్ గాయంపై రాహుల్ స్పందన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరు వికెట్లు తేడాతో గెలించింది. ఈ సందర్భంగా పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయంపై లక్నో కెప్టెన్ కె ఎల్ రాహుల్ స్పందించాడు. మయాంక్ పరిస్థితి దారుణంగా లేదని, ఫిట్ నెస్ పరంగా మంచిగానే ఉన్నారని, వంద శాత ఫిట్ ఉంటేనే ఆడించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మయాంక్ సిద్దంగా ఉన్నప్పటికి మరో రెండు మ్యాచ్ లకు విశ్రాంతి ఇచ్చామని, తదుపరి మ్యాచ్ లలో అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని రాహుల్ వివరణ ఇచ్చాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తాము 20 పరుగులు వెనకబడి ఉన్నామని, ఆరంభం బాగున్నా చివరలో ఉపయోగించుకోలేకపోయామని వివరణ ఇచ్చారు. కీలక సమయంలో స్పిన్నర్ కులదీప్ యాదవ్ మూడు వికెట్ల పడగొట్టి తమ జట్టు నడ్డివిరిచాడని రాహుల్ చెప్పారు. ఢిల్లీ జట్టులో బ్యాటర్లు జేక్ ఫ్రేజర్, పంత్ తమ నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నారని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని బరిలోకి దిగుతామని రాహుల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News