Sunday, November 24, 2024

భారత మాత ప్రతి ఒక్కరి స్వరం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాత ప్రతి ఒక్కరి స్వరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఉంచిన సందేశంలో తన భారత్ జోడో అనుభవాలను పంచుకున్నారు. యాత్ర సందర్భంగా ప్రజలు ఆదరణతో అందించిన నిశ్శబ్ద శక్తి తనకెంతో సహకరించిందన్నారు.‘ బలం, బలహీనతతో సంబంధం లేకుండా భారత మాత.. ప్రతి భారతీయుడి గళం.ఆ గళంలో ఆనందం, భయం, బాధ అంతర్గతంగా దాగి ఉంటుంది. ఈ భరతమాత గళాన్ని వినేటప్పుడు నా సొంత గళం, నా సొంత ఆకాంక్షలను నిశ్శబ్దంగా ఉంచాను. వినయంగా, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గళం వినిపిస్తుంది’ అని అన్నారు. ‘జోడో యాత్ర ప్రారంభంలో నా పాతగాయం తిరగబెట్టింది.

మోకాలి నొప్పి ప్రారంభమైంది. కానీ నాతో కలిసి ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వారు అందించిన ఆదరణతో ఆ నొప్పి మటుమాయమైంది. యాత్రను ఆపేద్దామని అనుకున్న ప్రతిసారి కూడా ఎవరో వచ్చి నాలో కొత్త శక్తిని నింపే వారు. అలా నిశ్శబ్ద శక్తి నాకు సహకరించింది. చిమ్మ చీకట్లు అలముకున్న అడవిలో కాంతిని నింపే మిణుగురుల వలె నాకు దోహదం చేసింది. ఈ క్రమంలో ఒకరోజు అంతులేని నిశ్శబ్దాన్ని అనుభవించా. నా చేయి పట్టుకున్న వ్యక్తి మాట తప్ప నాకు మరో శబ్దం వినిపించలేదు’ అని యాత్ర అనుభవాలను గుర్తు చేసుకున్నారు. గత ఏడాది కన్యాకుమారినుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర జరిగిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ముగియలేదని, మళ్లీ మొదలవుతతుందని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.ఈ సారి గుజరాత్‌నుంచి మేఘాలయ వరకు యాత్ర సాగుతుందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News