Wednesday, January 22, 2025

దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డు.. మన హైదరాబాద్ కుర్రాడి సొంతం

- Advertisement -
- Advertisement -

దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రంజీ ట్రోఫీ శుక్రవారం ప్రారంభమైంది. అందులో భాగంగానే హైదరాబాద్ టీమ్ తొలి మ్యాచ్ నాగాలాండ్ తో తలపడింది. రంజీ ట్రోఫీ సీజన్ ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్‌ అనే చెప్పాలి. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ గహ్లౌత్ రాహుల్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 2023–24లో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇందులో స్పెషల్ ఏందంటే దిగ్గజ క్రికెటర్లకు సాధ్యం కాని రికార్డును మన హైదరాబాద్ కుర్రాడు సొంతం చేసుకున్నాడు.

భారత దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆటను మైమరిపించేలా వేగంగా షాట్లు కొడుతూ రెచ్చిపోయాడు. దేశీయ ఛాంపియన్‌షిప్‌లో మొదటి రోజు రాహుల్ 157 బంతుల్లో 214 పరుగులు చేశాడు. అందులో తొమ్మిది సిక్సర్లు, 23 బౌండరీలతో అద్భుతమైన నాక్‌ ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాహుల్‌కి ఇది తొలి డబుల్ సెంచరీ, కెరీర్‌లో అత్యధిక స్కోరు కావడం విశేషం. హైదరాబాద్ టీమ్ లో నిలకడగా ఆడే ఆటగాళ్లు ఉన్న.. వేగంగా ఆడే బ్యాటర్స్ లేరనే వెలితి ఉండది.. కానీ ఇప్పుడు రాహుల్ సింగ్ గేమ్ చూస్తే ఆ లోటు తీరిపోయినట్లు అనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News