Monday, December 23, 2024

మోడీ ఝూటా మాట

- Advertisement -
- Advertisement -

Rahul slams Centre for lying about Corona deaths

సైన్స్ నిజాలే చెపుతుంది
కొవిడ్ మరణాలపై రాహుల్
47 లక్షల మరణాలు
4.8 లక్షలుగా కుదిస్తారా?
కేంద్రంపై కాంగ్రెస్ నేత మండిపాటు

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ మరణాలను కేంద్రం తక్కువ చేసి చూపుతోందని శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. తాము చెపుతున్న దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్థారించిందని వ్యాఖ్యానించారు. సైన్స్ అబద్ధం చెప్పదు. మోడీ చెపుతారు అని స్పందించారు. దేశంలో కొవిడ్‌తో ఇప్పటికే 47 లక్షల మంది మృతి చెందారని, అయితే ప్రభుత్వం అధికారికంగా కేవలం 4.8 లక్షల మంది చనిపోయినట్లు చెపుతోందని, ఇది మోడీ అసత్యాలలో దారుణ అసత్యం అని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను తాము గౌరవిస్తామని, ఈ సర్కారు ఆ పనిచేయలేకపోతోందని అన్నారు. మృతుల కుటుంబాలకు తలో రూ 4 లక్షల పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దాదాపు అరకోటి మంది వరకూ కొవిడ్‌తో చనిపోతే దీనిని కప్పిపుచ్చితే ఇక ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, అసమర్థత ఏమిటనేది తెలిసివస్తోందని రాహుల్ చెప్పారు. కేవలం ఐదు లక్షల మంది కొవిడ్‌తో చనిపోయినట్లు ప్రభుత్వం తప్పుడు లెక్కలకు దిగుతోందని, ఈ విధంగా ఎంతకాలం బుకాయిస్తారని రాహుల్ ప్రశ్నించారు.

దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే యత్నాలు
రాహుల్‌పై బిజెపి కౌంటర్

కొవిడ్ మరణాలపై రాహుల్ గాంధీ తప్పుడు వాదనకు దిగుతున్నారని బిజెపి శుక్రవారం ఎదురుదాడికి దిగింది. అన్ని విషయాలలో తమ ప్రభుత్వంపై బురద చల్లడం ఆయనకు అలవాటు అయిందని, చివరికి ఈ కొవిడ్ విషయంలోనూ ఇదే తంతుకు దిగారని పార్టీ ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. ఏదో విధంగా ప్రధాని మోడీని తిట్టిపోయడం ఆయనకు అలవాటు అయిందని విమర్శించారు. ఇతర దేశాల జనాభాను ఇక్కడి జనాభాను లెక్కచూసుకుంటే కొవిడ్ నివారణలో మనం ఎంతగా సమర్థవంతంగా వ్యవహరించామనేది తెలిసివస్తుందని, దీనిని ప్రపంచదేశాలు కూడా అంగీకరించి, భారత్‌ను ప్రశంసించాయని కానీ రాహుల్ ఈ నిజాలు అంగీకరించే ధైర్యం లేని విధంగా మాట్లాడుతున్నారని పాత్ర స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News