Thursday, January 23, 2025

ఆమె కన్నీటికన్నా మీ గౌరవం ఎక్కువా?

- Advertisement -
- Advertisement -

ఫోగట్ పతకాలు తిరిగి ఇవ్వడంపై ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం

న్యూఢిల్లీ: రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ మెడల్స్ గెలుచుకున్న రెజ్లర్ వినేశ్ ఫోగట్‌తనకు లభించిన ఖేల్త్న్ర, అర్జున అవార్డులను తిరిగి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. డబ్లుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బ్రిజ్భూషన్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా వినేశ్ ఫోగట్ ఈ అవార్డులను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

శనివారం ఫోగట్ ఈ అవార్డులతో ప్రధాని నివాసానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఆమె వాటిని కర్తవ్య్‌పథ్ పేవ్‌మెంట్‌పై వదిలిపెట్టి వెళ్లారు. ఈ దేశ బిడ్డలకు ఆత్మగౌరవం ముఖ్యమని, ఆ తర్వాతే ఏ మెడల్స్ అయినా, గౌరవమైనా అంటూ రాహుల్ గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు.

ఈ ధీర వనితల కన్నీళ్లకన్నా ‘ ప్రకటిత బాహుబలి’నుంచి పొందిన రాజకీయ లబ్ధి ముఖ్యమా? అని ప్రశ్నించారు. ప్రధాని దేశానికి సంరక్షకుడని, ఆయననుంచి ఇలాంటి అమానవీయతను చూడడం బాధాకరమని రాహుల్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. కాగా సంజయ్ సింగ్‌డబ్లుఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపట్ల పలువురు రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తూ తమ పతకాలను తిరిగి ఇచ్చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News