Friday, November 22, 2024

పార్టీ పగ్గాలు చేపట్టడంపై ఆలోచిస్తా

- Advertisement -
- Advertisement -
Rahul To Become Congress President Againసిడబ్లుసి సమావేశంలో పలువురి నేతల డిమాండ్‌పై రాహుల్

న్యూఢిల్లీ: మరో సారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే విషయాన్ని పరిశీలిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సిడబ్లుసి) సమావేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ సహా పలువురు పార్టీ నేతలు ఈ మేరకు విజ్ఞప్తి చేసిన తర్వాత రాహుల్ ఈ విషయం చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. సిబడబ్లుసి సమావేశంలో ప్రసంగించిన పలువురు నేతలు కూడా రాహుల్ గాంధీయే తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.అయితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలా లేదా అనే నిర్ణయం తీసుకోవలసింది ఆయనే’ అని పార్టీ పీనియర్ నేత అంబికా సోనీ ఓ వార్తాసంస్థకు చెప్పారు. రాహుల్ గాంధీయే తిరిగి కాంగ్రెస్ అధక్షుడి బాధ్యతలు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ పిసిసి విభాగం ఇటీవల ఒక తీర్మానం కూడా ఆమోదించింది. అలాగే కర్నాటక పిసిసి అధ్యక్షుడు శివకుమార్ సైతం రాహుల్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాలన్నదే ప్రతి పార్టీ కార్యకర్త అభిమతమని చెప్పడం గమనార్హం,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News