Monday, January 20, 2025

త్వరలో కొత్త ఇంట్లోకి రాహుల్ గాంధీ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ మాజీ ఎంపి రాహుల్ గాంధీ త్వరలోనే కొత్త ఇంట్లోకి మారనున్నట్లు తెలుస్తోంది. దివంగత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నివాసంలోకి ఆయన మారనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. న్యూఢిల్లీలోని నిజాముద్దీన్(తూర్పు)లో ఉన్న షీలా దీక్షిత్ నివసించిన ఇంట్లోకి మారాలని ప్రస్తుతం తన తల్లి సో గాంధీ నివాసంలో ఉంటున్న రాహుల్ గాంధీ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పుతో ఎంపి సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీచేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తల్లి నివాసంలోకి ఆయన చేరారు. అప్పటి నుంచి ఢిల్లీలో తనకు అనువైన ఇంటి కోసం ఆయన అన్వేషణ సాగిస్తున్నారు. అనేక ప్రాంతాలలో రాహుల్‌కు సౌకర్యంగా ఉండే ఇంటి కోసం వెతుకుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా షీలా దీక్షిత్ ఇంటి విషయం ఆయన దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌కు చెందిన ఆ 3 బెడ్‌రూమ్ ఇంట్లో ఆమె కుమారుడు, మాజీ ఎంపి సందీప్ దీక్షిత్ ఉంటున్నారు. తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి మారిపోవాలని ఆయన భావిస్తున్నట్లు రాహుల్ గాంధీ దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఉన్న కాలంలో ఆ ఇంటిని రాహుల్ ఈనేకసార్లు సందర్శించారు. తనకు చాలా పరిచయమైన ఆ ఇంట్లోనే చేరిపోవాలని రాహుల్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సందీప్ దీక్షిత్ ఖాళీ చేసిన వెంటనే ఆ ఇంటినే అద్దెకు తీసుకోవాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News