Monday, December 23, 2024

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కొత్త చిత్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Rahul Vijay and Shivani Rajasekhar launch a new film

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జులై 6 నుండి ఈ చిత్ర రెగ్యులర్ జరుపుకోనుంది. తెల్లవారితే గురువారం సినిమా తరువాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది. మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కథ. పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో క్లాసెస్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్  విడుదల కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News