Wednesday, January 22, 2025

అస్సాంలోని వరద ప్రాంతాల్లో రాహుల్ పర్యటన

- Advertisement -
- Advertisement -

గువాహటి: అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం పర్యటించారు. ఆయన కచార్ జిల్లాలో సిల్చార్‌ను సందర్శించారు. ఎయిర్‌పోర్ట్‌లో అస్సాం, మణిపూర్ కాంగ్రెస్ నేతలు ఆయనను కలిశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాహుల్ సందర్శించారు.

ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌కు ఆయన బయలుదేరారు. అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News