Wednesday, January 22, 2025

4 డిగ్రీల చలిలో చెప్పుల్లేకుండా రాహుల్ నడక

- Advertisement -
- Advertisement -

 

చండీగఢ్: గడ్డ కట్టే చలిలో టీషర్ట్ ధరించి భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పాదరక్షలు సైతం ధరించకుండా చండీగఢ్‌లో నడక సాగించారు. ఆయన వెంట పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ కైడా చెప్పులు ధరించకుండా నడిచారు. ఈ దృశ్యం బస్సీ పఠానా రోడ్డులో ఉన్న రౌజా షరీఫర్ షేక్ అహ్మద్ అల్ ఫరూఖి అల్ సరిహండీ దర్గా చోటుచేసుకుంది. రాహుల్ దర్గాను సందర్శించిన సమయంలో ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ ఉంది. స్వెటర్లు సైతం చలిని కాపాడలేకపోతున్న వాతావరణంలో రాహుల్ కేవలం టీషర్ట్ మాత్రమే ధరించడమేకాక కాలికి చెప్పులు కూడా ధరించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్‌లో తనను కలసిన ముగ్గురు పేద బాలికలు చలికి వణికిపోతున్న దృశ్యాన్ని చూసిన తర్వాత వారిలాగే తాను కూడా చలిని భరించడానికి టీషర్ట్ మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ ఇదివరకు ప్రకటించినవిషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News