- Advertisement -
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో మూడవ రోజు ప్రజల ఆదరణ మధ్య కొనసాగింది. ఒక మోస్తరుగా వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది ప్రజలు రోడ్డు కిరువైపులా బారులు తీరి రాహుల్ గాంధీకి అభివాదం తెలిపారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా రాహుల్ గొడుగు ఆసరా లేకుండానే తన పాదయాత్ర కొనసాగించారు. తన కాళ్లు బొబ్బలు ఎక్కినప్పటికీ దేశాన్ని ఐక్యం చేసేందుకు పాదయాత్రను ఆపే ప్రసక్తి లేదంటూ రాహుల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. మంగళవారం ఉదయం సుమారు 7.15 గంటలకు కళకూటం సమీపంలోని కనియాపురం నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలను ద్వేషం, హింస, ఆగ్రహంతో గెలవగలరేమో కాని దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలకు ఇది పరిష్కారం చూపలేదని అన్నారు.
- Advertisement -