Friday, November 22, 2024

తమిళనాట జల్లికట్టు జోరు

- Advertisement -
- Advertisement -

Rahul with Stalin for Madurai Jallikattu

 

కొవిడ్ బేఖాతరు రాజకీయ తీన్మార్

మధురై/చెన్నై : కొవిడ్ భయాలు ఏమీ లేకుండా, నిబంధనలను గాలికి వదిలిపెట్టి తమిళనాడులో జల్లికట్టు సాగింది. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ సాంప్రదాయక తమిళ క్రీడకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే కట్టుదిట్టంగా కొవిడ్ నియమనిబంధనల అమలు ఉంటుందని అధికారులు ప్రకటించారు. జల్లికట్టులోభాగంగా శిక్షణ ఇచ్చిన ఎడ్లను వదిలిపెట్టి వాటిని లొంగదీసుకునే ఆచారపు క్రీడ జల్లికట్టుగా తరాలుగా సాగుతోంది. ఇందులో పశువుల హింసాత్మక ప్రవృత్తి ఉందని పేర్కొంటూ జంతుకారుణ్య సంస్థలు వేసిన పిటిషన్లతో జల్లికట్టును సుప్రీంకోర్టు గతంలో నిషేధించింది. అయితే తరువాత తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో తమిళుల నిరసనల నడుమ నిషేధాన్ని ఎత్తివేశారు. క్రీడలు జరిగే ఇరుకైన ప్రవేశస్థలి వడివసల్‌లోకి పశువులను ఒకొక్కటిగా వదిలారు, వందలాది మంది ప్రజలుఇరువైపులా కేరింతల నడుమ వీక్షిస్తుండగా 300కు పైగా ఎడ్లు రంకెలు వేస్తూ వచ్చిచేరాయి.

కొవిడ్ నేపథ్యంలో 150 మందే జల్లికట్టులో పాల్గొనాలని నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేకించి మధురైలోని అవనియపురంలో భారీ స్థాయిలో జల్లికట్టు జరిగింది. మాస్క్‌లు పెట్టుకుని రంగంలోకి దిగాలని పోటీదార్లకు సూచించారు. కొవిడ్ భయాలు ఉన్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వం ఈ సాంప్రదాయక ఉత్సవానికి గత నెలలోనే నిర్వాహక అనుమతిని ఇచ్చింది. పశువును మనిషి జయించడం అనే చారిత్రక, జన విశ్వాస భరిత స్పందనకు అనుగుణంగా జల్లికట్టు సాగుతోంది. మధురైలోని పాలమూడులో ప్రధాన ఉత్సవం జరిగింది. మనుష్యులను దెబ్బతీసేందుకు దూసుకువచ్చే ఎడ్లను అదుపులోకి తెచ్చే వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో మనుష్యులు జంతువులకు తీవ్రస్థాయిలో గాయాలు అవుతాయి. కొన్ని ప్రాణాలు పోతాయి. రక్తం చిందించినా సాంప్రదాయం సాగుతుందని తమిళనాడులో జల్లికట్టు నిరాటంకంగా సాగుతూ పోతోంది. కరోనా వైరస్ సోకని వారిని ఈ క్రీడలకు అనుమతించారు.

మధురై జల్లికట్టుకు స్టాలిన్‌తో రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ తమిళనాడులో పొంగళ్ వేడుకకు హాజరయ్యారు. డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌తో కలిసి మధురై జిల్లాలో జరిగిన జల్లికట్టును ఆసక్తితో తిలకించారు. తమిళుల వీర సంస్కృతి, ఘనమైన చరిత్నను తాను ఇప్పుడు ఈ ప్రదర్శన ద్వారా కళ్లారా చూశానని, జల్లికట్టుకు తాను రావడం ఇది తొలిసారి కాదని, పలుసార్లు వచ్చానని తెలిపారు. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల దశలో కాంగ్రెస్ డిఎంకెల కూటమి ఏర్పడి ఘన విజయం సాధించుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి సాగనుంది. రాహుల్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, కెఎస్ అళగిరి, పుదుచ్చేరి సిఎం వి నారాయణస్వామి హాజరయ్యారు. జల్లికట్టు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నారని, ఎడ్లు, ఇందులో పాల్గొనే యువతరం కూడా మెళకువగా ఉంటూ వ్యవహరించం మంచిదని రాహుల్ వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News