మణిపుర్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపుర్ నుంచి ఆదివారం ప్రారంభం అయింది. రాహుల్ న్యాయ యాత్రను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రారంభించారు. రాహుల్ యాత్రతో దేశానికి ఏం ప్రయోజనమని కొందరు ప్రశ్నిస్తున్నారని, ప్రజల కష్టాలు, అవసరాలు తెలుసుకోవడమే యాత్ర ఉద్దేశమని మల్లికార్జున్ ఖర్గే వివరించారు. ఈ సందర్భంగా రాహల్ గాంధీ మాట్లాడుతూ…. భారత్ జోడో యాత్రలో దేశ ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నానని తెలిపారు. గతంలో మణిపూర్ పర్యటనలో ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. మణిపుర్ లో మౌలిక సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మణిపుర్ లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు మణిపుర్ లో పర్యటించలేదని మండిపడ్డారు. మణిపుర్ ప్రజల బాధలు తెలుసుకునేందుకు ప్రధాని రాలేదని రాహుల్ ఆరోపించారు. గతంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేనట్టానని, తూర్పు నుంచి పశ్చిమ వరకు యాత్ర చేయాలనే సూచన వచ్చిందని పేర్కొన్నారు. రాహల్ గాంధీ న్యాయ్ యాత్ర 67 రోజుల పాటు 6వేల 713 కిలోమీటర్ల దూరం సాగనుంది.15 రాష్ట్రాల మీదుగా 66 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగనుంది. మార్చి 21 వరకు యాత్ర కొనసాగనుంది. 100 లోక్‌సభ, 337 అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా కాంగ్రెస్ అధిష్టానం ఈ యాత్రను ప్లాన్ చేసింది.
LIVE: LAUNCH of Bharat Jodo Nyay Yatra | Thoubal, Manipur | Rahul Gandhi https://t.co/qUdKXanSWL
— Rahul Gandhi (@RahulGandhi) January 14, 2024