Wednesday, November 6, 2024

గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ స్థావరం పై దాడి..ఒకరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సాగర్ రోడ్డు లో బ్రాహ్మణ పల్లి దారిలో టీచర్స్ కాలని లో రహస్యంగా నిర్వహిస్తున్న గ్యాస్ సిలిండర్ల రీ ఫిల్లింగ్ స్థావరం పై దాడి చేసి, వాణిజ్య, గృహ వినియోగ సిలండర్ల ను భారీ ఎత్తున పట్టుకున్నట్టు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ తెలిపారు.బుధవారం నాడు మధ్యాహ్నం వనస్తలి పురం పోలీసుల తో కలసి సంయుక్తంగా జపిన దాడిలో 300 వరకు సిలిండర్లు పట్టుకున్నట్టు రఘునందన్ వివరించారు. ఇళ్ళకు సరఫరా చేయాల్సిన సిలిండర్ల ను గుట్టుగా దాచి,అక్రమంగా రీ ఫిల్లింగ్ చేసే దందా ను శంకర్,అంజి అనే ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్నట్టు విచారణ లో తేలిందన్నారు.

సిలిండర్లు దాచిన స్థలం లో ఉన్న ఆధారాలను బట్టి ఈ సిలిండర్లు రెడ్డి గ్యాస్ ఏజన్సీ కి చెందినవి గా ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. కర్మన్ ఘాట్ కు చెందిన ఐశ్వర్య గ్యాస్ ఏజెన్సీ లో ఫిరోజ్ అనే వ్యక్తి తమకు సహకరించి అధిక సిలిండర్లు ఇస్తాడని నిందితులు విచారణలో వెల్లడించారని చెప్పారు. మరిన్ని వివరాలు లోతైన దర్యాప్తు లో వెల్లడయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రెండు టాటా ఏస్ వాహనాలను,గ్యాస్ రీ ఫిల్లింగ్ రాడ్లను వనస్థలి పురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News