Wednesday, January 22, 2025

మార్గదర్శి కార్యాలయంలో రెండవ రోజు సోదాలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని మార్గదర్శి కార్యాలయంలో రెండవరోజు సోదాలు కొనసాగుతున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలు చేస్తుండగా మార్గదర్శి యాజమాన్యం సొంత మీడియాతో అధికారులకు ఆటంకం కలిగిస్తుంది. అధికారుల తనిఖీలను వీడియో కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ లోని సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిభందనలకు విరుద్ధంగా ఫిక్స్ డిపాజిట్లు సేకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మార్గదర్శి నిధుల మళ్లింపుపై ఆరా తీయడంతో పాటు మార్గదర్శిలో అధికారులు పంచనామా నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News