Wednesday, January 22, 2025

18 ఫార్మా కంపెనీల లైసెన్సులు రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నాసిరకం మందులు తయారు చేసే ఫార్మా కంపెనీలపై కొరడా ఝళిపించిన కేంద్ర, రాష్ట్ర రెగ్యులేటర్లు దేశవ్యాప్తంగా 76 కంపెనీలపై సంయుక్తంగా దాడులు నిర్వహించి 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలియజేశాయి. గత 15 రోజులుగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఏయే కంపెనీలపై దాడులు నిర్వహించింది మాత్రం తెలియరాలేదు. నాసిరకం మందులు తయారు చేసే కంపెనీలపై చేపట్టిన స్పేషల్ డ్రైవ్ మొదటి దశలో 76 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

‘నాసిరకం, కల్తీ మందులు తయారు చేస్తున్నందుకు, జిఎంపి నిబంధనలను ఉల్లంఘించినందుకు 18 ఫార్మా కంపెనీల లైసెన్సులను రద్ద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా మరో 26 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. మూడు కంపెనీల ఉత్పత్తి లైసెన్సులను కూడా రద్దు చేశాం’ అని ఆ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా రెగ్యులేటర్లు 203 కంపెనీలను గుర్తించారు. వీటిలో అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్‌లో 70 కంపెనీలు ఉండగా ఉత్తరాఖండ్(45), మధ్యప్రదేశ్(23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో మరిన్ని తనిఖీలు చేపట్టనున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News