నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆఫ్టర్ నైన్ పబ్‌పై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. పబ్‌లో ఉన్న 160మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 35మంది యువతులు ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆఫ్టర్ నైన్ పబ్ నిర్వహిస్తున్నారు. అయిత్ పబ్‌లో నిర్ణీత సమయం ముగిసిన తర్వాత పబ్ నడుపుతున్నారని, కస్టమర్లను ఆకర్శించేందుకు యువతులతో డ్యాన్స్ చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పబ్‌లోకి వెళ్లిన పోలీసులకు మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న యవతులు, యువకులు కన్పించారు. కస్టమర్లను ఆకర్శించడానికి పబ్ నిర్వాహకులు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి యువతులను రప్పించి నృత్యాలు చేయిస్తున్నట్లు తెలిసింది.
దాడి చేసిన పోలీసులు 40మంది యువతులతో సహా మొత్తం 160మందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.పట్టుబడిన యువతకు డ్రగ్స్ డిటెక్ట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. యువతులను సైదాబాద్‌లోని రెస్క్యూహోమ్‌కు తరలించారు. వారంతా గుల్బర్గా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. పబ్ నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. పట్టుబడిన వారికి 41ఏ సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేసి వివరాలు తీసుకుని పంపించారు. యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు చెప్పారు. పబ్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణల వచ్చాయని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఊర్వశీబార్‌ను మరవకముందే…
ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా బార్‌ను బేగంపేటలోని ఊర్వశీబార్‌ను యజమానులు నడిపించడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజుల క్రితం ఊర్వశీ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను రద్దు చేశారు. ఇక్కడ కూడా కస్టమర్లను ఆకర్శించేందుకు యాజమాన్యం యువతులతో అశ్లీల నృత్యాలు చేయించింది. ఈ విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేయడంతో బట్టబయలైంది.