మనతెలంగాణ/హైదరాబాద్: రైలు ప్రయాణికులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించే దిశగా మరో అడుగు వేస్తూ, దక్షిణ మధ్య రైల్వే జంట నగరాల్లోని మరో ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ నెక్లెస్ రోడ్డు రైల్వేస్టేషన్ ఆవరణలో ‘రైల్ కోచ్ రెస్టారెంట్’ను సోమవారం ప్రారంభించింది. ఇది ప్రత్యేకమైన భోజన వాతావరణం ద్వారా ఆహార ప్రియులకు వినూత్న అనుభూతిని అంది స్తోంది. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి నిరంతర ప్రయత్నంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన మరో వినూత్న అడుగు అని అధికారులు తెలిపారు.
ఇంతకుముందు కాచిగూడ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ప్రారంభించిన ‘రెస్టారెంట్ ఆన్‌వీల్స్’ తర్వాత ఇది తెలంగాణలో రెండో కోచ్ రెస్టారెంట్ అని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్‌లోని నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ ఆవరణలో ఆహార ప్రియులకు ప్రత్యేకమైన భోజన వాతావరణాన్ని, వారికి ప్రత్యేకమైన అనుభూతిని అందించడానికి ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ ను ప్రారంభించింది. నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ జంట నగరాల సబర్భన్ నెట్‌వర్క్‌లోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి అని అధికారులు తెలిపారు.
ఈ రైల్వేస్టేషన్ పరిసరాల్లో చాలా వినోదాత్మకమైన ప్రదేశాలను కలిగి ఉండటంతో పాటు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులకు సేవలందిస్తోంది. జంట నగరాల ఆహార ప్రియులకు అసమానమైన భోజన అనుభూతిని అందించడానికి, నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్‌ను కోచ్ రెస్టారెంట్ అన్న భావనతో ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ దీనిని ఇలా రూపొందించిందని అధికారులు తెలిపారు. దీని కోసం వాడుకలో లేని ఒక రైలు కోచ్‌ను ప్రయాణికులకు ప్రత్యేకమైన భోజన అనుభూతిని అందించడానికి పూర్తిగా ఆధునిక, అంతర్గతoగా సుందరంగా తీర్చిదిద్దారు. నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్‌లోని రైల్ కోచ్ రెస్టారెంట్ ఐదు సంవత్సరాల కాలానికి హైదరాబాద్‌కు చెందిన మెసర్స్ బూమరాంగ్ రెస్టారెంట్‌ను కేటాయించినట్టు అధికారులు తెలిపారు.