మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చె ప్పింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏ ర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. విభజన హామీలలో ఇది కూడా ఉం ది. ప్రస్తుతం కాజీపేటలో ఉన్న ఓవర్ హా లింగ్ వర్క్ షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జా రీ చేసింది. అప్‌గ్రేడ్ చేయాలని గత ఏడాది జులై 5న దక్షిణ మధ్య రైల్వే జీఎంకి రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్ గ్రేడ్ చేసిన యూనిట్లో ఎల్‌హెచ్‌బీ,
ఈఎంయూ కోచ్‌లను తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ని అభివృద్ధి చేయడానికి ఈ ఏ డాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాజీపేట రైల్వే కోచ్ డిమాండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేసి కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు కో రాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం.