Monday, December 23, 2024

రైల్ నిలయంకు గోల్డ్ రేటింగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయ భవనం రైల్ నిలయం కు గోల్డ్ రేటింగ్ అవార్డును పొందింది. ఐ.జి.బి.సీ.ప్రమాణాలకు అనుగుణంగా భవనం ప్రస్తుత గోల్ రేటింగ్ మరో 3 సంవత్సరాలకు తిరిగి ధృవీకరించబడింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ భవనం, రైల్ నిలయం, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐ.జి.బి.సీ)ద్వారా ప్రతిష్టాత్మకమైన ఐజిబిసీ – గ్రీన్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ గోల్ రేటింగ్‌ను పొందింది. ఈ భవనం ఇంతకు ముందు గోల్ రేటింగ్‌ను సాధించింది మరియు గోల్ రేటింగ్ కోసం నిర్దేశించిన అన్ని ప్రమాణాలను పాటించినందుకు గోల్ రేటింగ్‌తో తిరిగి ధృవీకరించబడింది. ఈ సర్టిఫికేషన్ జూలై 2023 నుండి మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.ఈ భవనానికి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ వ్యర్థ నీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ అనుకూలమైన గార్డెనింగ్ , విద్యుత్ శక్తి ఆదాతో పాటు ఉత్పత్తి, నివాసితుల సౌకర్యాలు, భవన కార్యకలాపాల నిర్వహణ వంటి వివిధ నీటి సంరక్షణ పొదుపు చర్యల ద్వారా సాధించబడింది.

ఐజిబిసీ భారతీయ రైల్వేల పర్యావరణ డైరెక్టరేట్ మద్దతుతో హరిత భావనలను స్వీకరించడానికి గ్రీన్ రైల్వే స్టేషన్ల రేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా స్టేషన్ ఆపరేషన్ , నిర్వహణ కారణంగా ప్రతికూల పర్యావరణ ప్రభావాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా మొత్తం ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ఇంధన సామర్థ్యం, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గడం, వర్జిన్ మెటీరియల్స్‌పై తక్కువ ఆధారపడటం నివాసితుల ఆరోగ్యం, శ్రేయస్సు వంటి జాతీయ ప్రాధాన్యతలను పరిష్కరించడానికి రేటింగ్ విధానం సహాయపడుతుంది. ఈ రేటింగ్ కోసం నిర్దేశించిన ఆరు ప్రమాణాలు – స్థిరమైన స్టేషన్ సౌకర్యం, ఆరోగ్యం, పరిశుభ్రత పారిశుధ్యం, ఇంధన సామర్థ్యం, నీటి సామర్థ్యం, స్మార్ట్ ,గ్రీన్ చొరవ, ఆవిష్కరణ అభివృద్ధి వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. కాగా రైలు నిలయం భవనం ఈ నిబంధనలపై మూల్యాంకనం చేశారు. అందువలన రైల్ నిలయం భవనం హరిత పద్ధతుల అమలులో స్థిరత్వాన్ని కొనసాగించింది. తద్వారా గోల్డ్ రేటింగ్‌తో తిరిగి ధృవీకరణ పొందింది.

ఐజిబిసీ నుండి గోల్డ్ రేటింగ్‌ను పొందడంలో తమ వంతు సహాయాన్ని అందించి హరిత పద్ధతులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను హైదరాబాద్ డివిజన్ అధికారులు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయ అధికారులను ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. పచ్చదనంతో కూడిన పర్యావరణానికి సహకారం నిరంతర ప్రక్రియగా ఉండాలని, సిబ్బంది అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని పర్యావరణ పద్ధతుల పట్ల మరింత శ్రద్ధ చూపాలని, ఇది తదుపరిసారి అత్యధిక రేటింగ్‌ను సాధించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News