Friday, September 27, 2024

ట్రాక్‌పై పడి ఉన్న రైలు పట్టా.. ఢీకొన్న ప్యాసింజర్ రైలు

- Advertisement -
- Advertisement -

ఇటీవలి కాలంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్న సంఘటనలు ఎదురవుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని బొటాడ్ జిల్లా కుండ్లీ గ్రామానికి సమీపంలో బుధవారం తెల్లవారు జామున ట్రాక్‌పై పడి ఉన్న రైలు పట్టా భాగాన్ని ప్యాసింజర్ రైలు ఢీకొని అక్కడే నిలిచిపోయింది. ఓఖా భావ్‌నగర్ ప్యాసింజర్ రైలు రాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి మీదుగా వెళ్తూ నాలుగు అడుగుల పొడవున్న పాత రైలు పట్టా భాగాన్ని ఢీకొట్టి ఆగిపోయిందని బొటాడ్ ఎస్‌పి కిషోర్ బలోలియా చెప్పారు. దాంతో కొన్ని గంటల పాటు రైలును ఆపవలసి వచ్చిందన్నారు.

ఈ సంఘటన గురించి బుధవారం ఉదయం 7.30 గంటలకు తెలియగానే ఆ ప్రదేశానికి పోలీస్ అధికారులు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. కుండ్లీ రైల్వేస్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. రైలును పట్టాల నుంచి తప్పించే ఇదో విద్రోహచర్యగా భావిస్తున్నారు. అధికారులు , పోలీస్‌లు పరిస్థితిని చక్కదిద్ది తిరిగి రైళ్లు యధావిధిగా తిరిగేలా చర్యలు తీసుకున్నారు. ట్రాక్ టాంపరింగ్ చేశారన్న నేరంపై సూరత్ జిల్లాలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసిన తరువాత ఈ సంఘటన జరగడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News