Saturday, December 21, 2024

రైల్వే ఎఎస్ఐ భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్వే ఎఎస్‌ఐ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాముల జిల్లా నెల్లూరు జిల్లా కావలి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోనసీమ జిల్లాకు చెందిన నరసింహారావు, దుర్గాభవానికి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొన్ని రోజులగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో మంగళవారం అర్ధరాత్రి భర్తతో గొడవ పెట్టుకొని గదిలోకి వెళ్లి గడియవేసుకొని దుర్గాభవాని ఉరేసుకుంది. ఇది ఆత్మహత్య కాదని హత్య చేశారని దుర్గభవాని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు రోజు తన కూతరు తమకు ఫోన్ చేసి భర్త ఎక్కువగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. కావలి ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News