Monday, December 23, 2024

రైల్వేలకు రూ.2.4 లక్షల కోట్లు: సీతారామన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: రైల్వేల కోసం రూ.2.4 లక్షల కోట్లు కేటాయించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైల్వేలో 2013-14 సంవత్సరం తరువాత ఈ బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు జరిగాయన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలాసీతారామన్ ప్రారంభించారు. ఇపిఎఫ్‌ఓ సభ్యత్వాల సంఖ్య 27 కోట్లకు చేరడంతో డబుల్ అయ్యాయన్నారు. 2022లో యుపిఐ ద్వారా 7400 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగాయని వివరించారు.  ఏకలవ్య మోడల్ ఆశ్రమ పాఠశాలలకు 38800 టీచర్ల నియామక ప్రతిపాదించారు. పిల్లలు, యుక్త వయస్కుల కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రిమిటివ్ వల్నరబుల్ డెవలప్‌మెంట్ కోసం రానున్న మూడేళ్లకు రూ.15000 కోట్ల కేటాయించనున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News