Tuesday, March 11, 2025

100 ఫుడ్‌ప్లాజాల ఏర్పాటుకు రైల్వే నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Railway decision to set up 100 food plazas

న్యూఢిల్లీ : దేశంలోని రైల్వేస్టేషన్లలో ఫుడ్‌ప్లాజాలు, ఫాస్ట్‌ఫుడ్ యూనిట్లు, రెస్టారెంట్లు, ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఐఆర్‌సీటీసీకి కేటాయించిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఆయా చోట్ల వీటిని నెలకొల్పాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఈమేరకు ఆయా జోనల్ కార్యాలయాలకు ఇటీవల రైల్వే బోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టికటేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఫుడ్‌ప్లాజాలను నెలకొల్పేందుకు ఐఆర్‌సీటీసీకి కేటాయించిన ఖాళీ స్థలాలను వినియోగించుకునేందుకు 17 రైల్వే జోన్లకు రైల్వేబోర్డు అనుమతి ఇచ్చింది. నిరుపయోగంగా ఉన్న ఆయా స్థలాల్లో ఫుడ్‌ప్లాజాలు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని రైల్వేబోర్డు తన ఉత్తర్వుల్లో రైల్వే జోన్లకు సూచించింది. ఈ జోన్ల పరిధిలో సుమారు 100 నుంచి 150 వరకు ఈ తరహా యూనిట్లు నెలకొల్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టులను సమీక్షించిన తరువాత 9 ఏళ్ల కాలానికి వీటికోసం బహిరంగ టెండర్లు ఆహ్వానించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News