- Advertisement -
నో మాస్క్ నో ఎంట్రీ అంటూ
ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ
మాస్క్ లేకపోతే 500 రూపాయల ఫెనాల్టీ
హైదరాబాద్: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. నో మాస్క్ నో ఎంట్రీ ఆదేశాలు ఇచ్చింది. రైల్వే అధికారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు. మాస్క్‌లేని ప్రయాణికులకు జరిమానా విధించారు. టికెట్ ఉన్నా మాస్క్ లేకుంటే బయటకు పంపిస్తామన్నారు. మాస్క్ లేకపోతే 500 రూపాయల ఫెనాల్టీ విధిస్తామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో రాకేష్ తెలిపారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కేసులతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. మహారాష్ట్రలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ జైపూర్‌లోని ఒకే కుటుంబంలోని 9 మందికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కావడం కలకలం రేపింది.
- Advertisement -