Thursday, January 23, 2025

కదులుతున్న రైలులో బాలికపై అత్యాచారం… రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు.

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం చేయడంతో అతడిని ప్రయాణికులు కొట్టి చంపిన సంఘటన బిహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఢిల్లీకి వెళ్లేందుకు హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. ఆ కుటుంబం జనరల్ టికెట్లు తీసుకుంది. టిటిఇ అనుమతి ఇవ్వడంతో ఎసి కోచ్-డిలో బాలిక కుటుంబం కూర్చుంది. బాలిక తన తల్లితో కలిసి వాష్‌రూమ్‌కు వెళ్లింది. బాలిక ఒంటరిగా కనిపించడంతో అటెండెంట్ ప్రశాంత్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. ప్రయాణికులు, ఆ కుటుంబం కలిసి ప్రశాంత్‌పై దాడి చేయడంతో స్పృహ తప్పిపడిపోయాడు. గురువారం తెల్లవారుజామున రైలు కాన్పూర్‌కు చేరుకోగానే జిఆర్‌పి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రశాంత్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని నిర్దారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News