Sunday, December 22, 2024

ప్రయాణికురాలి లగేజీ చోరీ.. రైల్వేకి రూ.లక్ష జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికురాలి లగేజీ చోరీకి సంబంధించి ఓ వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. సేవల్లో నిర్లక్షం లోపాలు ఉన్నాయని భారతీయ రైల్వే కు రూ.లక్ష జరిమానా విధించింది. లగేజీ కోల్పోయిన బాధితురాలికి మొత్తం రూ. 1.08 లక్షలు చెల్లించాలని సంబంధిత జనరల్ మేనేజర్‌ను ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికురాలు 2016 జనవరిలో మాల్వా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు.

ఈ నేపథ్యంలో ఝాన్సీ నుంచి గ్వాలియర్ స్టేషన్ల మధ్య ఆమె బ్యాగు చోరీకిగురైంది. అందులో రూ.80 వేల విలువైన వస్తువులు ఉన్నాయంటూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు ప్రయాణికులు,వారి వస్తువుల భద్రత కూడా రైల్వేదేనని ఆమె వాదించింది. ఈ పిటిషన్‌ను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ విచారించింది.

ఈ విషయంలో భారతీయ రైల్వే నిర్లక్షం, సేవాలోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు కోల్పోయిన వస్తువుల విలువ రూ. 80 వేలను తిరిగి పొందేందుకు అర్హురాలని పేర్కొంది. దీంతోపాటు ఆమెకు కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు పరిహారంగా రూ. 20 వేలు, న్యాయ ప్రక్రియ ఖర్చుల కింద మరో రూ. 8 వేలు చెల్లించాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News