Tuesday, January 21, 2025

రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Railway Head Constable suicide in Palnadu

పల్నాడు: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్ళ రైల్వే క్వార్టర్‌‌లో శనివారం ఉదయం సత్య వర్ధన్ అనే రైల్వే రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  45 రోజుల క్రితమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సత్య వర్ధన్.. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Railway Head Constable suicide in Palnadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News