Wednesday, January 22, 2025

రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 మంది నుంచి రూ 50 లక్షలు తీసుకొని…

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: రైల్వే ఉద్యోగాల పేరుతో నిజామాబాద్‌లో మోసం జరిగింది. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 మందికి కుచ్చుటోపీ వేశారు. ఒక్కొక్కరి నుంచి దాదాపుగా లక్ష రూపాయలు వసూలు చేశారు. నిందితుల వద్ద నుంచి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్, ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నరేష్‌పై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో నరేష్ మోసాలపై కూడా విచారిస్తున్నట్టు సమాచారం. గతంలో నరేష్ దందాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News