మనతెలంగాణ/ హైదరాబాద్ : కష్టాలకు, నష్టాలకు వెరవకుండా.. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు ఓ రైల్వే కూలీ. చరిత్రతో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. రైల్వే స్టేషన్‌లో ప్రీ వై ఫై సహాయంతో కేరళ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన స్ఫూర్తివంతమైన ఓ యువకుడి గురించి తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లోకి వెళ్లే మార్గం చాలా కఠినమైనది. అయితే కేరళకు చెందిన ఓ రైల్వేకూలీ కేరళ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐఎఎస్‌లో తనకంటూ ఒక స్థానాన్ని రైల్వే కూలీ శ్రీనాథ్ సంపాదించుకున్నారు. రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న ఉచిత వై-ఫై సహాయంతో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మున్నార్ యాడ్‌కు చెందిన శ్రీనాథ్ .. కొచ్చిన్ రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేశారు.
తన కుటుంబానికి మెరుగైన జీవితం ఇవ్వాలంటే.. తాను ఇప్పుడు సంపాదిస్తున్న సంపాదన సరిపోదని భావించారు. మంచి జీతం కలవాలంటే.. ప్రభుత్వం ఉద్యోగం సంపాదించాలని ఆలోచించిన శ్రీనాథ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఓ వైపు కూలీగా పనిచేయాల్సి ఉండడంతో.. పని సమయాలు, భారం ఇవన్నీ కలిపి శ్రీనాథ్ కు చదువుకోవడానికి సమయం సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో 2016లో.. రైల్ టెల్, గూగుల్ భారతదేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో ఉచిత వై ఫైని అందించాయి. ఇలా రైల్వే స్టేషన్ లో ఉచిత వై ఫై ప్రారంభించిన తర్వాత.. శ్రీనాథ్ పని చేస్తూనే చదువుకోవడంపై మరింత దృష్టి పెట్టాడు. ఆడియోబుక్స్, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేవారు. తనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుని లక్ష్యాన్ని సాధించాడు.