Thursday, January 23, 2025

ఢిల్లీకి తరలిన రైల్వే నాయకులు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: కాజీపేట జంక్షన్ నుంచి రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు రైల్వే ఎంప్లాయిస్ సంఘ నాయకులు ఢిల్లీకి తరలివెళ్లారు. నూతన పింఛన్ స్కీం వద్దని పాత పింఛన్ స్కీమునే కొనసాగించాలని గురువారం దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్ల నాయకుల ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్లినట్లు ఆయా ట్రేడ్ యూనియన్ల నాయకులు తెలిపారు. కాజీపేట నుంచి రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోన్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఢిల్లీకి తరలివెళ్లారు.

అదే విధంగా సికింద్రాబాద్ నుంచి రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఏజీఎస్ భరణిభాను ప్రసాద్ సాంగ్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ భుజంగరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్త ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో తరలివెళ్లారు. మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ రవీందర్, సదానందం, నాయకులు గిన్నారపు రాజు, సాయికుమార్, వేద ప్రకాష్, గిరిమిట్ల రాజేశ్వర్, జాని, తిరుపతి, బిక్షపతి, రాజేందర్, సమ్మయ్య, శ్రీనివాస్‌యాదవ్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News