Sunday, June 30, 2024

అమరావతి రైల్వే లైన్ కు గెజిట్ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే లైను ప్రతిపాదనకు రైల్వే శాఖ వేగంగా స్పందించింది. పూర్తిగా స్వంత నిధులతో రైల్వే లైను నిర్మించాలని నిర్ణయించుకుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా.. ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అమరావతి ప్రధాన స్టేషనుగా తొమ్మది స్టేషన్లు ఉండనున్నాయి. విజయవాడ-హైదరాబాద్ లైన్‌లో ఎర్రుపాలెం వద్ద కొత్త లైన్ మొదలై… అమరావతి మీదుగా గుంటూరు-విజయవాడ లైన్‌లోని నంబూరు వద్ద కలుస్తుంది.

ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో మొత్తం 9 స్టేషన్లు నిర్మిస్తారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు పెద్ద స్టేషన్లు. వీటిలోనూ అమరావతి ప్రధాన స్టేషన్‌గా ఉంటుంది. ఈ లైన్‌లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట-వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News