ముంబై: కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ముంబై లోకల్ రైలులో ప్రయాణించారు. రెండు అదనపు రైల్వే లైన్లకు సంబంధించి తనిఖీ కోసం ఆయన ముంబై సబర్బన్ రైల్ నెట్‌వర్క్ పరిధిలోని థాణె-దివా స్టేషన్ల మధ్య లోకల్ రైలులో ప్రయాణించడమే కాక థాణె స్టేషన్ బయట రోడ్డు పక్కన బండిలో వడా పావ్ తిన్నారు. థాణె-దివాలను కలిపే రైల్వే లైన్లను ఇటీవల నిర్మించారు. వీటిని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం మధ్యాహ్నం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం వైష్ణవ్ ముంబై చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో థాణె స్టేషన్లలో లోకల్ రైలు ఎక్కిన ఆయన సెకండ్ క్లాసు బోగీలో దివా స్టేషన్ దాకా ప్రయాణించారు. దివా స్టేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రత్యేక ఇన్స్‌పెక్షన్ కోచ్‌లో థాణె స్టేషన్‌కు తిరిగివచ్చారు. అనంతరం ఆయన స్టేషన్ బయట రోడ్‌సైడ్ స్టాల్‌లో వడాపావ్ తిని, టీ తాగారు. మంత్రి వెంట కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ దాన్వె, రైల్వే బోర్డు చైర్మన్ వికె త్రిపాఠి, ఇతర అధికారులు ఉన్నారు.
ముంబై లోకల్ రైలెక్కిన రైల్వే మంత్రి వైష్ణవ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -