Friday, November 15, 2024

రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరను తగ్గించాలి

- Advertisement -
- Advertisement -

Railway platform ticket price should be reduced

ప్రయాణికుల విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ బంధువులను స్టేషన్ నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు, శుభకార్యాలకు సొంతూర్లకు వెళ్తున్న భార్య, పిల్లలను రైలు ఎక్కించేందుకు వస్తున్న వారు పెరిగిన ఫ్లాట్‌ఫాం టికెట్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో ఇంటి నుంచి తక్కువ ధరతో వస్తున్నప్పటికీ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు వెనకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా దృష్ట్యా పండుగ వేళల్లో రైళ్లలో, స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆ సమయానికి తగిన విధంగా 10 రూపాయలు ఉన్న ప్లాట్ ఫాం టికెట్ ధరను ముందుగా 30 రూపాయలకు పెంచారు.

ఆ తర్వాత కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లోకి వచ్చే వారి సంఖ్యను తగ్గించేందుకు వీలుగా రైల్వే అధికారులు ప్లాట్ ఫాం టికెట్ ధరను ఏకంగా రూ. 50కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం టికెట్ ధర 50 రూపాయలు ఉందని, కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో ప్లాట్‌ఫాం టికెట్ల ధరను తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే పూర్తిగా కరోనా నియంత్రణకు వచ్చినా ప్రయాణికులతో వచ్చే వారిని నివారించేందుకు ఇలా టికెట్ ధరను తగ్గించలేదని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా మారిన అనంతరం మళ్లీ ప్లాట్ ఫాం టికెట్ ధర తగ్గే అవకాశం ఉండవచ్చని వారు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News