- Advertisement -
ముంబై: కదులుతున్న రైలు నుంచి పడిపోబోయిన ఓ మహిళను రైల్వే పోలీస్ అధికారి కాపాడారు. ముంబైలోని బోరివలి స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘మహారాష్ట్రలోని బోరవలి స్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి దిగబోయి బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో ఆమె రైలు-ఫ్లాట్‌ఫామ్‌కు మధ్యలో పడిపోయింది. అక్కడే ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. ఈ చర్యను అభినందిస్తున్నాం. రైళ్లలో ప్రయాణించేప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తారు’’ అని పేర్కొంది. రైల్వే భద్రతాధికారి చేసిన ఈ సాయాన్ని ‘మిషన్ జీవన్ రక్ష’గా అభివర్ణించింది.
- Advertisement -