Sunday, December 22, 2024

ప్రియురాలు కోసం రైల్వే సిగ్నల్‌పై దాడి…

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రియురాలు మీద కోపంతో ఓ వ్యక్తి రైల్వే సిగ్నల్స్ ధ్వంసం చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుప్పత్తూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. తిరుప్పత్తూర్ వివిధ గమ్య స్థానాలకు చేరుకునేందుకు రైలు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. రైలు సిగ్నల్ స్తంభంపై ఓ వ్యక్తి దాడి చేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అతడి పేరు గోకుల్(30)గా గుర్తించారు. తాను ప్రేమిస్తున్న యువతి మాట్లాడకపోవంతోనే సిగ్నల్‌పై దాడి చేశానని చెప్పారు. ఒడిశా రైలు ప్రమాదంతో రైల్వే ప్రయాణికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.

Also Read: ఈ గద ఎవరి వశమయ్యేనో?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News