Sunday, December 22, 2024

విధులు నిర్వహిస్తూ రైల్వే టికెట్ కలెక్టర్ మృతి..

- Advertisement -
- Advertisement -

Railway Ticket Collector died after Heart Attack in Gadwal

హైదరాబాద్: విధులు నిర్వహిస్తూ ఓ రైల్వే టికెట్ కలెక్టర్ మృతి చెందాడు. గత రాత్రి కాచిగూడ నుండి ఎలహంక (యశ్వంతపూర్) వెళ్ళే రైలులో విధుల నిర్వహణలో వున్న రైల్వే టికెట్ కలెక్టర్ జన్ను శ్యాం(49) మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ దాటిన తరువాత అకస్మాత్తుగా గుండె పోటుకు గురై కూర్చున్న చోటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. మధ్య రాత్రి రైలు గద్వాల రైల్వే స్టేషన్ కు చేరుకున్న తరువాత అతనిని గద్వాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు. మృతుని వెంట ఉన్న సహచర టికెట్ కలెక్టర్లు షేక్ అలీ, వెంకటేష్ కుమార్ అతన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని గద్వాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపాడు.

Railway Ticket Collector died after Heart Attack in Gadwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News