- Advertisement -
కొన్ని వారాలుగా వివిధ రైళ్లలో పరిమితికి మించిన ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న సందర్భాల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 46 దూర ప్రాంత రైళ్లలో అదనంగా 92 జనరల్ కేటగరీ బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ శుక్రవారం వెల్లడించింది. మరిన్ని రైళ్లలో జనరల్ బోగీలను చేర్చనున్నట్లు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ’46 రైళ్లలో 92 కొత్త జనరల్ కేటగరీ బోగీలు అమర్చడమైంది. ఇందు కోసం మరి 22 రైళ్లను గుర్తించడమైంది’ అని ఆ ప్రకటన తెలిపింది. అదనపు బోగీలు ఏర్పాటు చేసిన రైళ్ల జాబితాను కూడా మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో పొందుపరచింది. ‘ఆ రైళ్లలో చేర్చిన అదనపు బోగీల వల్ల ప్రయాణం చేసే సాధారణ ప్రజలకు ఉపశమనం కలుగుతుంది’ అని మంత్రిత్వశాఖ తెలిపింది.
- Advertisement -