Wednesday, January 22, 2025

రైల్వేలు, రక్షణ రాజకీయాలకు అతీతం

- Advertisement -
- Advertisement -

రైల్వేలు జాతికి జీవన రేఖ
రాజకీయ నిందలు వేయతగదు
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ : రైల్వే ప్రమాదాలు రాజకీయ కాక రేపుతుండగా జాతీయ రవాణా సంస్థ అయిన రైల్వేలను రాజకీయ నిందల క్రీడాంశం చేయతగదని, అది దేశానికి జీవన రేఖ అని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం స్పష్టం చేశారు. కొన్ని సంఘటనల్లో కలవరపరిచే ధోరణులు కొన్ని కానవచ్చాయని, ప్రతి ఒక్క సంఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణ సాగిస్తున్నదని మంత్రి తెలియజేశారు. రైలు పట్టాలపై బండరాళ్లు, కడ్డీలు ఉంచుతుండడం వల్ల రైళ్లు పట్టాలు తప్పుతున్న ఘటనలపై ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ ఆ స్పష్టీకరణ ఇచ్చారు. ‘కొన్ని సంఘటనల్లో ఆందోళనకరమైన ధోరణులు కొన్ని కనిపించాయి. ఆ విషయాన్ని తీవ్రమైనదిగా పరిగణించాలి’ అని వైష్ణవ్ అన్నారు.

కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ, ‘రైల్వే, రక్షణ శాఖలు రాజకీయాలకు అతీతంగా ఉంచవలసినవి. రైల్వేలను రాజకీయ నింద క్రీడకు అంశం చేయరాదు’ అని చెప్పారు. రైల్వేలు దేశానికి జీవన రేఖ అని, ఏదైనా ప్రతికూలత సంభవిస్తే రైళ్లను అత్యంత సమర్ధమైన రీతిలో నడిపేలా కృషి చేయవలసి ఉంటుందని వైష్ణవ్ అన్నారు. వేరే ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, రైల్వే శాఖ గడచిన ఒక సంవత్సరంలో ప్రస్తుత నెట్‌వర్క్‌కు 5300 కిలోమీటర్ల రైలు మార్గాలు కలిపిందని తెలియజేశారు. రైల్వేల్లో రిక్రూట్‌మెంట్ గురించి మంత్రి ప్రస్తావిస్తూ, జాతీయ రవాణా సంస్థలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఒక రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను రూపొందించిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News